body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.pf0{}
ఢిల్లీ.,04జనవరి (హి.స.): ప్రకృతి విపత్తుల సమయంలో వేగంగా స్పందించేందుకు లక్షమంది క్యాడెట్లకు ‘యువ ఆపద మిత్ర’లుగా శిక్షణ ఇవ్వనున్నట్లు ఎన్‌సీసీ డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ వీరేంద్ర వత్స్ శనివారం వెల్లడించారు. వీరిని డేటాబేస్‌తో అనుసంధానిస్తామని చెప్పారు. దానివల్ల ఏదైనా విపత్తు సంభవించినప్పుడు వారి సేవలను వినియోగించుకునే వీలుంటుందని దిల్లీలో విలేకరుల సమావేశంలో తెలిపారు. దేశవ్యాప్తంగా నాలుగైదు హబ్‌లు ఏర్పాటుచేసి, ఎంపిక చేసిన క్యాడెట్లకు.. డ్రోన్, కౌంటర్ డ్రోన్ అంశాలపై శిక్షణ ఇస్తామని చెప్పారు. అలాగే సైబర్ నేరాలకు చెక్ పెట్టేలా 10 వేలమంది క్యాడెట్లతో సైబర్ వారియర్స్‌ను ఏర్పాటు చేయాలని ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. వీరిని కూడా డేటాబేస్‌తో అనుసంధానం చేయనున్నారన్నారు. ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఎన్‌సీసీ పరేడ్, కంటింజెంట్ కమాండర్లు తొలిసారి కత్తితో కవాతు చేయనున్నారని వెల్లడించారు.
—————
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ
