దిల్లీ,15,,జనవరి (హిం.స)ఉత్తరప్రదేశ్లో బీఎస్పీ మరో పార్టీతో పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో పోరాడినప్పుడల్లా లాభం కంటే ఎక్కువగా నష్టపోయిందని, తమ పార్టీ ఓట్లు ఇతరులకు బదిలీ అవుతున్నాయని మాయావతి అన్నారు. దీంతో ఒంటరిగానే పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు వివరించారు.
రానున్న లోక్ సభ ఎన్నికల్లో) బీఎస్పీ ఒంటరిగానే పోటీ చేస్తుందని బీఎస్పీ అధినేత్రి మాయావతిస్పష్టం చేశారు. సోమవారం ఆమె మాట్లాడుతూ.. బీఎస్పీ ఎవరితోనూ పొత్తు పెట్టుకోబోదని అన్నారు
హిందూస్తాన్ సమాచార్ /నాగరాజ్
