బెంగళూరు:జనవరి 18( హింస) ఒక వ్యక్తి రైలు కంపార్ట్‌మెంట్‌లోని ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం తెలిసిన రైల్వే పోలీసులు, అధికారులు ఆ కంపార్ట్‌మెంట్‌ను వేరు చేశారు. దీంతో ఆ రైలు ఆలస్యంగా ఆ స్టేషన్ నుంచి కదిలింది. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ సంఘటన జరిగింది. బైయప్పనహళ్లిలోని సర్ ఎం విశ్వేశ్వరయ్య టెర్మినల్ (ఎస్‌ఎంవీటీ)లో కారైకల్ ఎక్స్‌ప్రెస్ నిలిచి ఉంది. బుధవారం ఉదయం ఆ రైలు కంపార్ట్‌మెంట్‌లోని ఫ్యాన్‌కు ఒక వ్యక్తి మృతదేహం వేలాడుతూ కనిపించింది. అందులోకి ఎక్కిన ప్రయాణికులు ఇది చూసి షాక్ అయ్యారు. రైల్వే పోలీసులు, రైల్వే అధికారులకు సమాచారం ఇచ్చారు.
పుట్ట సుమన్, హిందూస్తాన్ సమాచార
