న్యూఢిల్లీ, 3 ఆగస్టు (హి.స.)
మన దేశం 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవడానికి సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా ఢిల్లీలో భద్రతా ఏర్పాట్లు మరింత కట్టుదిట్టం అయ్యాయి. అదే సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజల నుంచి తమ ఆలోచనలను పంచుకోవాలని కోరారు. మీ ఆలోచనలను MyGov పోర్టల్ లేదా NaMo యాప్ ద్వారా పంచుకోవచ్చు. ఇది ప్రజలు నేరుగా దేశ భవిష్యత్తు గురించి తమ ఆలోచనలను వ్యక్తం చేయడానికి వచ్చిన అద్భుతమైన అవకాశమని చెప్పవచ్చు.
ఈ నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు ఆగస్టు 2 నుంచి ఆగస్టు 16 వరకు గగన తలంలో అన్ని రకాల సబ్-కన్వెన్షనల్ ఏరియల్ ప్లాట్‌ఫామ్‌లపై నిషేధం (Delhi no fly zone) విధించారు. ఢిల్లీ పోలీస్ కమిషనర్ ఎస్‌బీకే సింగ్ ఈ ఉత్తర్వులను జారీ చేశారు. ఈ నిషేధం కింద ఈ వస్తువులు వస్తాయి.
—————
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ
