దిల్లీ,24,జనవరి (హిం.స) తమిళనాడులోని మధురై జిల్ల అలంగనల్లూరు సమీపంలోని కీలకరైలో నూతనంగా నిర్మించిన జల్లికట్టు స్టేడియాన్ని సీఎం స్టాలిన్ ప్రారంభించారు. జల్లికట్టు కోసం దేశ చరిత్రలో తొలిసారిగా ప్రత్యేకంగా ప్రభుత్వం నిర్మించిన స్టేడియం ఇదే కావడం గమనార్హం. స్టేడియంలో తొలిసారిగా ఆరువందల ఎద్దులు పోటీలకు సిద్ధమయ్యాయి. నాలుగు వందలమంది యువకులు ఈ పోటీల్లో పాల్గొనేందుకు సిద్ధమయ్యారు. కొత్త జల్లికట్టు స్టేడియానికి మాజీ ముఖ్యమంత్రి, దివంగత డీఎంకే నేత ఎం.కరుణానిధి పేరు పెట్టారు. ఈ గ్రామంలో రూ.44 కోట్ల అంచనా వ్యయంతో 5 వేల మందికి పైగా సీటింగ్ కెపాసిటీతో ప్రపంచస్థాయి జల్లికట్టు స్టేడియాన్ని నిర్మిస్తామని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ గతంలో ప్రకటించారు.
హిందూస్తాన్ సమాచార్ /నాగరాజ్
