దిల్లీ: 9 జూలై (హి.స.) (బీటీఏ) చర్చల్లో కీలక పరిణామాలు చోటుచేసుకోనున్నాయని అంచనా. అందులో డెయిరీ ఉత్పత్తులు, జన్యుపరంగా మార్పు చెందిన (జీఎం) ఉత్పత్తులపై నిబంధనల్లో మార్పులు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. డెయిరీ అనేది లక్షలాది గ్రామీణ కుటుంబాల జీవనోపాధితో ముడిపడి ఉన్న సున్నితమైన పరిశ్రమ. కాబట్టి ఈ డీల్ నుంచి పాడి పరిశ్రమను మినహాయించడానికి యూఎస్ సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తోంది. జన్యుపరంగా మార్పు చెందిన (జీఎం) వ్యవసాయ ఉత్పత్తుల్లో ముఖ్యంగా సోయాబీన్స్, మొక్కజొన్నకు భారత్‌లో అధిక మార్కెట్‌కు అవకాశం ఉన్నందున అమెరికా ఒత్తిడి పెంచాలని చూస్తున్నట్లు సమాచారం.
వాణిజ్య ఒప్పందం నుంచి డెయిరీ పరిశ్రమను దూరంగా ఉంచాలన్న భారత్ డిమాండ్‌పై అమెరికా కొంత సానుకూలంగా స్పందిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ పరిశ్రమతో ముడిపడి ఉన్న సామాజిక, ఆర్థిక సున్నితత్వాన్ని యూఎస్ అంగీకరిస్తున్నట్లు పేర్కొన్నాయి.
—————
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ
