body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-family:Garamond;font-size:11pt;}.cf2{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf3{font-family:Garamond;font-size:11pt;}.pf0{}
ఢిల్లీ 26నవంబర్ (హి.స.)చైనాలో షాంఘై పుడాంగ్ విమానాశ్రయంలో తన భారత పాస్‌పోర్ట్‌ను గుర్తించేందుకు ఆ దేశ అధికారులు నిరాకరించారని భారత మహిళ (Indian woman) పెమా వాంగ్‌జోమ్ థాంగ్‌డోక్ పేర్కొన్న విషయం తెలిసిందే. చైనాలో అధికారులు తనని వేధించిన సమయంలో అండగా నిలిచిన వారికి, భారత విదేశాంగశాఖ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. తన ఇబ్బందులను కూడా సోషల్ మీడియాలో ట్రోల్ చేసేవారికి రిప్లై ఇచ్చేంత సమయం తనకు లేదని వెల్లడించారు.
తన వద్ద చెల్లుబాటయ్యే వీసా ఉన్నా కూడా చైనా అధికారులు తన పాస్‌పోర్ట్‌ను స్వాధీనం చేసుకున్నారని, జపాన్ వెళ్లే విమానం ఎక్కనివ్వలేదని, చివరకు ఆహారం కొనేందుకు కూడా అంగీకరించలేదని పెమా వాంగ్‌జోమ్ థాంగ్‌డోక్ పేర్కొన్నారు. తన సమస్యను విదేశాంగ (Indian embassy)శాఖ దృష్టికి తీసుకువెళ్లిన ఒక గంట లోపు.. భారత అధికారులు విమానాశ్రయానికి వచ్చి, తనకు ఆహారం అందించారన్నారు. చైనా అధికారులతో సమస్యపై చర్చించి.. తాను ఆ దేశం నుంచి బయటకు రావడానికి సహాయం చేశారన్నారు. మరో భారతీయుడికి తనలాంటి పరిస్థితి ఎదురవ్వకుండా చర్యలు తీసుకోవాలని విదేశాంగ మంత్రిత్వ శాఖ, ప్రధానమంత్రి కార్యాలయం, అరుణాచల్ సీఎంలకు లేఖ రాశారు.
—————
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ
