దిల్లీ, 07,జనవరి (హిం.స) భారతదేశం)లో గత 24 గంటల్లో 756 కొత్త కోవిడ్ 19 కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు మరణాల సంఖ్య రెట్టింపు కావడంతో స్థానిక ప్రజలతోపాటు ఇతరుల్లో కూడా భయాందోళన మొదలైంది.
దీంతో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 4,049కి చేరిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం తెలిపింది. ఇదే క్రమంలో మరణాలు ఐదు రికార్డయ్యాయి. నిన్న రెండు మరణాలు నమోదు కాగా..ఈరోజు డబుల్ కావడం విశేషం. వీటిలో మహారాష్ట్ర, కేరళ నుంచి రెండు చొప్పున నమోదు కాగా..జమ్ము కాశ్మీర్ నుంచి ఒకటి నమోదైంది. ఈ నేపథ్యంలోనే 889 మంది కరోనా నుంచి రికవరీ అయ్యారు.
మరోవైపు దేశవ్యాప్తంగా మరణాలు(deaths) సంఖ్య కూడా క్రమంగా పెరగడం పట్ల ప్రజల్లో భయాందోళన మొదలైంది. అంతేకాదు చల్లని వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ఈ వైరస్ మరింత విస్తరిస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇలాంటి క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎక్కువగా రద్దీ ఉండే ప్రాంతాలకు వెళ్లే సమయాల్లో తప్పనిసరిగా మాస్కులు ధరించాలని కోరారు
హిందూస్తాన్ సమాచార్ /నాగరాజ్
