దిల్లీ,15,,జనవరి (హిం.స)తమిళనాడు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో జల్లికట్టు పోటీలు ఆరంభమయ్యాయి. ఈ జల్లికట్టు అనేది తమిళనాడులోని గ్రామీణ ప్రాంతాల్లో ఆడే ఒక సంప్రదాయక క్రీడ.. దీంట్లో ఎద్దులకు మనుషులకు మధ్య పోరాటం జరుగుతుంది. జల్లుకట్టును తమిళనాడు సంస్కృతికి చిహ్నంగా అక్కడి ప్రజలు పరిగణిస్తారు. ఈ పోటీల నిర్వహణకు అవనియాపురంలో ముమ్మరంగా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. మదురైలో జల్లికట్టు నిర్వహణకు ముందుగా పోటీలో పాల్గొనే ఎద్దులకు హెల్త్ చెకప్ కూడా చేశారు. ఇక, జనవరి రెండో వారంలో పొంగల్ పంట పండుగ సందర్భంగా తమిళనాడులో జల్లికట్టు పోటీలు నిర్వహిస్తున్నారు. వరుసగా మూడు రోజుల పాటు సాగే ఈ క్రీడలను చూసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలి వస్తారు.
హిందూస్తాన్ సమాచార్ /నాగరాజ్
