ముంబయి,19, సెప్టెంబర్ (హి.స.) ప్రజాస్వామ్యాన్ని కాపాడేదే నిజమైన దేశభక్తి అన్న నినాదంతో కాంగ్రెస్ పార్టీ ఓటు హక్కు రక్షణ కోసం ఓ ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. వోట్ చోరీపై సంతకాల సేకరణ పేరుతో ప్రారంభించిన ఈ కార్యక్రమం ద్వారా ప్రజల హక్కులు, ప్రతి ఓటు విలువను కాపాడాలని కాంగ్రెస్ పిలుపునిస్తోంది.
వయనాడ్ ఎంపీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా ఈ ఉద్యమానికి నాయికత్వం వహిస్తూ, దేశ ప్రజలు ఇందులో భాగస్వామ్యం కావాలని కోరారు (Priyanka Gandhi Signature Campaign). మీ ఓటు మాత్రమే కాదు, మీ సంతకం కూడా ఎంతో శక్తివంతం అని ఆమె ఈ సందర్భంగా పేర్కొన్నారు. ప్రజాస్వామ్య హక్కులపై జరుగుతున్న దాడులపై పోరాడేందుకు ఇది ఒక ముందడుగని సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేసి వెల్లడించారు
—————
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ
