న్యూఢిల్లీ, 7 జూలై (హి.స.)
అమెరికా, బ్రిక్స్ దేశాల మధ్య వాణిజ్య యుద్ధం మరింత తీవ్ర రూపం దాల్చింది. బ్రిక్స్ కూటమి అనుసరిస్తున్న అమెరికా వ్యతిరేక విధానాలకు మద్దతిచ్చే ఏ దేశంపైన అయినా అదనంగా 10 శాతం సుంకాలు విధిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ఈ విధానంలో ఎలాంటి మినహాయింపులు ఉండవని ఆయన స్పష్టం చేశారు. తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ట్రూత్ సోషల్’ వేదికగా ట్రంప్ నేడు ఈ హెచ్చరికలు జారీ చేశారు. “బ్రిక్స్ కూటమి అవలంబిస్తున్న అమెరికా వ్యతిరేక విధానాలతో ఏ దేశం ఏకీభవించినా, ఆ దేశంపై అదనంగా 10 శాతం సుంకం విధిస్తాం. ఈ విషయంలో మీరంతా దృష్టి సారించినందుకు ధన్యవాదాలు” అని ఆయన పేర్కొన్నారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..
