అయోధ్య 08,జనవరి (హిం.స)జనవరి 22న అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవ వేడుక కార్యక్రమం జరగనుంది. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ వేడుకను నిర్వహించనున్నారు. ఈ వేడుకను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. రామాలయం ప్రారంభోత్సవం వేడుకను అందరూ చూసే విధంగా ప్రత్యక్ష ప్రసారం చేయబోతున్నారు. బూత్ స్థాయి నుంచి భారతదేశం అంతటా ఈ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం కానుంది. పలు నివేదికల ప్రకారం అమెరికాలోని న్యూయార్క్ నగరంలో గల ఐకానిక్ టైమ్స్ స్క్వేర్లో అయోధ్య రామాలయం ప్రారంభోత్సవాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు.
హిందూస్తాన్ సమాచార్ /నాగరాజ్
