వాషింగ్టన్, డి.సి., 22 అక్టోబర్ (హి.స.)భారత ప్రధాని నరేంద్ర మోడీతో జరిగిన చర్చలలో ప్రధానంగా వాణిజ్య అంశాలపై చర్చించినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఓవల్ కార్యాలయంలో ట్రంప్ విలేకరులతో మాట్లాడుతూ “మేము అనేక సమస్యల గురించి మాట్లాడాము.. అయితే ఎక్కువగా వాణిజ్యం గురించి మాట్లాడాము” అని అన్నారు. భవిష్యత్తులో భారతదేశం రష్యా నుంచి పెద్ద మొత్తంలో చమురు కొనుగోలు చేయదని ఆయన పునరుద్ఘాటించారు.
వైట్ హౌస్‌లో దీపావళి వేడుకలను ఉద్దేశించి ప్రసంగించిన ట్రంప్.. భారతీయులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాన మంత్రి మోడీతో తన సంభాషణ గురించి మళ్ళీ అనేక విషయాలను వెల్లడించారు. “భారత ప్రజలకు కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నేను ఈరోజు మీ ప్రధాన మంత్రి (నరేంద్ర మోడీ)తో మాట్లాడాను. మేము చాలా మంచి సేపు వాణిజ్యం గురించి మాట్లాడుకున్నాము” అని ఆయన అన్నారు.
—————
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV
