హైదరాబాద్, 22 అక్టోబర్ (హి.స.)
ఉగాండాలో ఘోర రోడ్డు ప్రమాదం
చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 63 మంది మరణించగా మరికొందరికి గాయాలయ్యాయి. ఉగాండా రాజధాని కంపాలాలోని గులు హైవేపై మంగళవారం అర్ధరాత్రి ఓ బస్ డ్రైవర్ లారీని ఓవర్ టెక్ చేస్తూ ఎదురుగా వస్తున్న మరో బస్సును ఢీ కొట్టాడు. బస్సును వెంటనే మరోవైపుకు తిప్పగా పక్కనే వస్తున్న రెండు కార్లను సైతం ఢీ కొట్టాడు.
దీంతో నియంత్రణ కోల్పోయిన వాహనాలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి. ఈ క్రమంలో బస్సుల్లో, కార్లలో ప్రయాణిస్తున్న 63 మంది మరణించగా కొంతమందికి తీవ్రగాయాలు, మరికొంతమందికి స్వల్ప గాయాలయ్యాయి. ఘటనాస్థలానికి చేరుకున్న అధికారులు మృతదేహాలను అక్కడ నుండి తరలించారు. క్షతగాతృలను వెంటనే ఆస్పత్రికి తీసుకువెళ్లారు. ఈ ఘటన దేశంలో అతి పెద్ద రోడ్డు ప్రమాదాల్లో ఒకటిగా నిలిచింది.
—————
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..
