ముంబై, 27 నవంబర్ (హి.స.)కాస్త తగ్గినట్టు కనిపించిన బంగారం, వెండి ధరలు మళ్లీ దూసుకుపోతున్నాయి. ఎంత తగ్గినా తులం బంగారం కొనాలంటేనే లక్షా 20 రూపాయలకుపైగా చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఉంది. తులం బంగారం ధర రెండు రోజుల్లో సుమారు రూ.3000 పెరిగితే కిలో వెండి ధర రూ.5000 పెరిగింది. బంగారం ధరలు మళ్లీ పెరుగుతుండటం పసిడిప్రేమికులకు ఆందోళన కలిగిస్తోంది. నవంబర్ 27న ఉదయం 6 గంటల సమయానికి దేశీయంగా తులం బంగారం ధర రూ.1,27,920 ఉండగా, కిలో వెండి ధర రూ. లక్షా 69,100 ఉంది.
—————
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV
