పాయకరావుపేట, 13 అక్టోబర్ : అనకాపల్లి జిల్లా పాయకరావుపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గురువారం నిర్వహించిన జగనన్న సురక్ష ఆరోగ్య శిబిరంలో ఇచ్చిన మందులపై తెలంగాణ లేబుల్ కన్పించడం చర్చనీయాంశమైంది.
దగ్గు మందు బాక్సుపై తెలంగాణ ప్రభుత్వ సరఫరా లేబుల్ అతికించి ఉంది. ఇటీవల ఎలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబురాజు మందులు పూర్తిస్థాయిలో లేవంటూ అధికారులపై ఆగ్రహించారు. అంతలోనే ఈ మందులు దర్శనమిచ్చాయి.
వైద్యాధికారి విద్యాసాగర్‌ను వివరణ కోరగా ‘మందులు ఎక్కడ నుంచి వచ్చాయి, ఎవరు సరఫరా చేశారన్నది గమనించలేదు.
