ఆంధ్రప్రదేశ్ 13 అక్టోబర్ : రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు.
చంద్రబాబు చర్మ సంబంధిత అస్వస్థతపై సెంట్రల్ జైలు అధికారులు ప్రకటన విడుదల చేశారు. జైలు వైద్యాధికారులకు చంద్రబాబు తన చర్మ సమస్యలను తెలియజేయగా.. రాజమండ్రి ప్రభుత్వాసుపత్రి నుంచి వైద్యులను పిలిపించారు.
ప్రభుత్వాసుపత్రి నుంచి వచ్చిన ఇద్దరు వైద్యులు చంద్రబాబును పరీక్షించారు. చర్మ సంబంధిత సమస్య ఉందని ఆయన చెప్పడంతో చర్మ వైద్యుల్ని పిలిపించామని, డాక్టర్లు పరీక్షలు చేసి మందులను సూచించారని, ఆ మందులను చంద్రబాబుకు అందిస్తామని డిప్యూటీ జైలు సూపరింటెండెంట్ రాజ్ కుమార్ వెల్లడించారు.
