నాగార్జునసాగర్, 20 ఆగస్టు (హి.స.): ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో నాగార్జున సాగర్‌కు వరద ప్రవాహం పెరిగింది. సాగర్ 26 గేట్లు ఎత్తి అధికారులు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో 10 లక్షల క్యూసెక్కులు కాగా, ఔట్ ఫ్లో 4.06 లక్షల క్యూసెక్కులుగా ఉంది. సాగర్ పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 312.04 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 294.55 టీఎంసీల నీరు నిల్వ ఉంది.
—————
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ
