కర్ణాటక, 7 జూలై (హి.స.)
2023 ఎన్నికల తర్వాత డీకే
శివకుమార్కు ఉన్నత పదవి రావాల్సిందని రాంభాపూరి మఠాధిపతి శ్రీ రాజదేశికేంద్ర శివాచార్య స్వామి చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందిస్తూ పార్టీ కార్యకర్తలు, ఆధ్యాత్మిక నాయకులు, ప్రజలు నేను సీఎం కావాలని కోరుకుంటున్నారు. అయితే అందులో తప్పేమీ లేదు,” అని శివకుమార్ వెల్లడించారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఐదు సంవత్సరాల పూర్తి కాలపరిమితి వరకు సీఎం గా కొనసాగుతారని, ఆయన ప్రకటించిన అంశానికి తాను బహిరంగంగా మద్దతు తెలిపినప్పటికీ, తాను తదుపరి ముఖ్యమంత్రి కావాలని తనకు మద్దతు ఇచ్చే మంచి మనసున్న వారు కోరుకోవడం సహజమేనని ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ స్పష్టం చేశారు. అప్పట్లో “కాంగ్రెస్ పార్టీ విజయానికి శివకుమార్ చేసిన సేవలను రాష్ట్ర ప్రజలకు తెలుసు,” అని స్వామీజీ అన్నారు. అయితే, ఈ విషయాన్ని పార్టీ కార్యకర్తలు, నేతలు, ప్రతిపక్ష నేతలు, మీడియా అనవసరంగా చర్చిస్తూ కొనసాగిస్తూనే ఉన్నారని శివకుమార్ అసహనం వ్యక్తం చేశారు. ఈ అంశంపై బహిరంగంగా మాట్లాడకూడదని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మాకు సూచించారు. ఆ మార్గదర్శకాలను మేము గౌరవిస్తాము,” అని శివకుమార్ తెలిపారు.
—————
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..
