కరీంనగర్: ఏప్రిల్
తెలంగాణలో బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ మధ్య అగ్గి రాజుకుంటోంది. ఇరు పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు కరీంనగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కేటీఆర్ ఒక డ్రామా ఆర్టిస్ట్ అని.. ఆయనకు ఒకప్పుడు వేసుకునేందుకు బట్టలు కూడా ఉండేవి కావని ఎద్దేవా చేశారు. తనను గాలి తిరుగుడు అనడంపై బండి సంజయ్ మండిపడ్డారు. ”నీ అయ్య లేకపోతే నీ బతుకు ఏంది?” అని కేటీఆర్ను నిలదీశారు. తాను జనం కోసం పోరాడానని.. కేటీఆర్ అమెరికాలో చిప్పలు కడిగాడని విమర్శించారు. ఎన్నికలు వస్తేనే కేంద్ర పాలిత ప్రాంతం గుర్తుకు వస్తుందన్నారు. ‘నీ అవినీతిని బయట పెడుతానన్నారు.
ఇప్పటికే నీ చెల్లె జైలుకు పోయింది. మేం రాముడి వారసులం.మీరు బాబర్ వారసులు” అంటూ కేటీఆర్పై బండి సంజయ్ విరుచుకుపడ్డారు.
