*హైదరాబాద్ 19 ఏప్రిల్నే ను జర్నలిస్టుగా ఫలానా పార్టీకి ఓటు వేయాలని చెప్పకూడదు. అయితే వ్యక్తుల విషయంలోచెప్పొచ్చు. తెలంగాణ అంటే కొట్టినవాళ్లు, 16 పార్టీలు మారిన వారు. నోరు తెరిస్తే బూతులు మాట్లాడే వారికి ఓటు వేయకూడదని చెబుతున్నాను. సంస్కారవంతులకు ఓటు వేయాలి. మచ్చలేని వ్యక్తులను ఆశీర్వదించాలి. సంస్కారం, శీలం, జ్ఞానం, కరుణ, ఆచరణ, సేవాగుణం గల వ్యక్తులకు మాత్రమే ఓటు వేయాలి. అటు దత్తాత్రేయ కావొచ్చు.. ఇటు కిషన్ రెడ్డి కావొచ్చు వారికి మాత్రం నేను ప్రతీసారి ఓటు వేసిన. ఈసారి కూడా వారికే ఓటు వేస్తాను.
*బార్ కౌన్సిల్ చైర్మన్, నర్సింహా రెడ్డి,*
కిషన్ రెడ్డి మచ్చలేని వ్యక్తి. సికింద్రాబాద్ ఎంపీగా కిషన్ రెడ్డి ఇన్ని కార్యక్రమాలు చేయడం నన్ను ఆశ్చర్యం కలిగించింది. ఆయన ప్రజల ఆశీస్సులతో మరింత బాగా పని చేయాలని కోరుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సహకారం లేకున్నా.. కేంద్రం మంత్రిగా రాష్ట్రానికి ఎన్నోనిధులు ఇచ్చారు. ఆయన చేసిన పనులు అర్థం చేసుకునే ప్రజలు ఆయనను వదులుకోరు.
