న్యూఢిల్లీ హిందుస్థాన్ సమాచారం
భారత్ పై నోరు జారి పదవి పోగొట్టుకున్న మాల్దీవుల మాజీ మంత్రి మరియం షియూనా మరోసారి వివాదాస్పద పోస్ట్ చేశారు. ఆదేశపుప్రతిపక్ష పార్టీని ఉద్దేశించి ఆమె చేసిన ఒక పోస్ట్ నందు ఆ పార్టీ లోగోకు బదులు భారత జాతీయ జెండాపై ఉండే అశోక చక్రం ఉంది. దీనిపై అన్ని వైపుల నుండి విమర్శలు రావడంతో ఉద్దేశపూర్వకంగా తాను ఈ పోస్ట్ చేయలేదని మరియం క్షమాపణలు కోరారు. గతంలో ఈమె మన ప్రధాని మోదీ లక్షద్వీప్ పర్యటనకు సంబంధించి అనుచిత వ్యాఖ్యలు చేసి సస్పెండ్ కావడం తెలిసిందే..
