విశాఖపట్నం(ఆంధ్రప్రదేశ్), ఏప్రిల్ విశాఖ రైల్వే స్టేషన్లోని ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ పాక్షికంగా కుంగింది. మూడవ ఎంట్రన్స్ ఎదురుగా ఈ బ్రిడ్జ్ ఉంది. వెంటనే రైల్వే అధికారులు అప్రమత్తమయ్యారు. కుంగిన ఫుట్ ఓవర్ వంతెన మీద రాకపోకలను నిలిపివేశారు. రైళ్ల రాకపోకలకు ప్రయాణికులకు ఎటువంటి అంతరాయం లేదని రైల్వే అధికారులు తెలిపారు. దీని మరమ్మతులకు చర్యలు తీసుకుంటున్నట్టు వారు పేర్కొన్నారు.
