విజయవాడ: పేదల ప్రభుత్వం, సంక్షేమ ప్రభుత్వం అని చెప్తున్న జగన్ ప్రభుత్వం అసలు ఏమి చేసింది?. ప్రజల సంక్షేమం గురించి ఏమి చేసింది?.. పేపర్ల ప్రకటనల కొరకు ఖర్చు చేయటం తప్ప ఇంకేమి చేయలేదని బీజేపీ రాష్ట్ర ప్రతినిధి సాధినేని యామిని ) తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఈ సందర్బంగా ఆదివారం ఆమె విజయవాడ లో మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర పథకాలనే రాష్ట్ర ప్రభుత్వం పేరు మార్చి అమలు చేస్తోందన్నారు. డ్వాక్రా మహిళలకు అన్యాయం జరుగుతోందని, అంగన్వాడీ ()లకు న్యాయం చేయలేకపోవటం వైసీపీ చేస్తున్న అరాచకాలపై ధ్వజమెత్తారు. ఏపీ ని డ్రగ్స్ (, గంజాయి ( రాష్ట్రంగా ప్రభుత్వం మార్చేసిందని, ప్రశ్నిస్తున్న వారిపై దాడులకు దిగుతున్నారని మండిపడ్డారు.
