పట్నా: 04, ఏప్రిల్లో క్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. ఎన్డీయే కూటమిలోని లోక్‌జనశక్తి పార్టీ (రామ్ విలాస్)(LJP)కి ఎదురుదెబ్బ తగిలింది. పార్టీకి షాకిస్తూ పలువురు నేతలు రాజీనామా చేశారు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి కబర్చిన 22 మంది నేతలకు టికెట్ లభించకపోవటంతో వారంతా రాజీనామా బాటపట్టారు.
రాష్ట్ర మాజీ మంత్రి, జాతీయ ఉపాధ్యక్షురాలు రేణు కుష్వాహ, మాజీ ఎమ్మెల్యే, జాతీయ ప్రధాన కార్యదర్శి సతీష్ కుమార్, ఉపాధ్యక్షుడు సంజయ్ సింగ్, సంస్థాగత కార్యదర్శి రవీంద్ర సింగ్ రాజీనామా చేశారు. అదేవిధంగా వారి మద్దతుదారులు పెద్దఎత్తున రాజీనామాలను రాష్ట్ర అధ్యక్షుడు రాజు తివారీకి పంపించారు. శాంభవీ చౌదరీ( సమస్తిపూర్), రాజేశ్ వర్మ (ఖాగారియా), వీణా దేవి ( వైశాలీ) వంటి నేతలకు టికెట్లు కేటాయించటంపై రాజీనామా చేసిన నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారికి చిరాగ్ పాశ్వాన్, అతని సన్నిహితులు… డబ్బులకు పార్టీ టికెట్లు అమ్ముకున్నారని మండిపడ్డారు.
