తెలంగాణ రంగా రెడ్డి కొండాపూర్ మార్చ్: రోజురోజుకు హిజ్రాల ఆగడాలు మితిమిరిపోతున్నాయి. బలవంతపు వసూళ్లకు పాల్పడుతూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. కొండాపూర్లో గత గురువారం అర్ధరాత్రి ఒంటిగంటకు సుమారు 30మంది హిజ్రాలు ఓ వ్యక్తిపై దాడిచేసి బలవంతంగా అతని అకౌంట్ నుంచి రూ.30 వేలు పోన్పే చేయించుకున్నట్లు తెలిసింది. సదరు వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ, దీనిపై పోలీసులు ఎటువంటి కేసు నమోదు చేయలేదు. ఈ విషయం సోషల్మీడియాలో వైరల్గా మారింది. హెల్ప్చేయండి అంటూ పోలీసులకు, మీడియా ప్రతినిధులకు, రాజకీయ నాయకులకు ఫొటోలు, వీడియోలు షేర్ చేశాడు. దీనిపై గచ్చిబౌలి పోలీసులను వివరణ కోరగా తమకు ఎలాంటి ఫిర్యాదూ రాలేదని లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని తెలిపారు.
