నెల్లూరు ఆత్మకూరునియోజకవర్గంలో నేటి నుంచి ప్రజాగళం కార్యక్రమం ప్రారంభమవుతుందని నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు.
గురువారం నాడు మీడియాతో మాట్లాడిన ఆయన.. ఇవాళ సాయంత్రం 4 గంటలకు ఏఎస్ పేటలో జరగబోయే బహిరంగ సభలో వైసీపీ నుంచి టీడీపీలోకి భారీ ఎత్తున చేరికలు ఉంటాయని చెప్పారు. ప్రతి ఒక్కరూ రాష్ట్ర భవిష్యత్ గురించి ఆలోచించాలని పిలుపునిచ్చారు.
