



అమరావతి, జనవరి 17(హిం.స(: అయోధ్య రామాలయంలో శ్రీరామ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి రావాల్సిందిగా ఇప్పటికే అనేక మంది ప్రముఖులకు ఆహ్వానాలు వెళ్లాయి. ఇప్పుడు తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు కూడా అయోధ్యకు రావాలని ఆహ్వానం వచ్చింది.
ఈనెల 22న అయోధ్య రామజన్మభూమి దేవాలయంలో ప్రాణప్రతిష్ట వేడుక జరుగనుంది. ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా చంద్రబాబుకు శ్రీ రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రతినిధులు ఆహ్వానం అందించారు.
హిందూస్తాన్ సమాచార రాజీవ్
