విశాఖ23 మార్చ్ : విశాఖ డ్రగ్స్ కేసులో నిందితులుగా ఉన్నది వైసీపీ నాయకులేనని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. వైసీపీ నాయకులతో నిందితులకు సంబంధాలున్నాయనే విషయం రాష్ట్ర ప్రజలకు తెలుసన్నారు. విజయవాడ టీడీపీ వర్క్షాప్లో ఆయన మాట్లాడుతూ.. కూనం వీరభద్రరావుకు వైసీపీ నాయకులతో సంబంధాలున్నాయన్నారు. సంక్రాంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఫెక్సీల్లో జగన్, వైసీపీ నేతల ఫోటోలు ఉన్నాయని.. దీనికి సమాధానం చెప్పకుండా తిరిగి తమపై దాడి చేసేందుకు వైసీపీ ప్రయత్నం చేస్తోందన్నారు. జగన్ ఐదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని గంజాయి రాష్ట్రంగా మార్చేశారని ఆరోపించారు.
