దిల్లీ,23,మార్చి : సినీ రంగం నుంచి మరో నాయిక రాజకీయాల్లోకి అడుగుపెట్టేందుకు సిద్ధమయ్యారు. ప్రముఖ బాలీవుడ్ నటి, మోడల్ నేహాశర్మవచ్చే లోక్సభ ఎన్నికల్లోపోటీ చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. బిహార్ నుంచి ఆమెను బరిలోకి దింపాలని నేహా తండ్రి, కాంగ్రెస్ నేత అజయ్ శర్మ ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు. దీనిపై తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు.
