సూళ్లూరుపేట,23 మార్చ్ అంతరిక్ష వ్యర్థాల నియంత్రణలో భాగంగా ఒకసారి ప్రయోగించిన రాకెట్ను తిరిగి భూమి మీదికి తీసుకొచ్చే ప్రక్రియలో ఇస్రో కీలక ముందడుగు వేసింది. దీనికోసం అభివృద్ధి చేసిన రీయూజబుల్ లాంచ్ వెహికిల్ (ఆర్ఎల్వీ) ఎల్ఈఎక్స్-02 స్వయంగా ల్యాండయ్యే పరీక్షను శుక్రవారం విజయవంతంగా నిర్వహించింది.
