కిర్లంపూడి8 మార్చ్ : మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంతో వైసీపీ నాయకులు సమావేశమయ్యారు.
కాకినాడ జిల్లా కిర్లంపూడిలోని ఆయన నివాసానికి ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల వైకాపా రీజనల్ కోఆర్డినేటర్ మిథున్‌రెడ్డి, కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి, కాకినాడ ఎంపీ వంగా గీత, మాజీ మంత్రులు కురసాల కన్నబాబు, తోట నరసింహం, పెద్దాపురం నియోజకవర్గ ఇన్‌ఛార్జి దవులూరి దొరబాబు, వైసీపీ నాయకుడు జక్కంపూడి గణేష్ తదితరులు వెళ్లారు. సుమారు గంటసేపు ముద్రగడ, ఆయన కుమారులు వీర్రాఘవరావు (బాలు), చల్లారావు (గిరి)తో చర్చలు జరిపారు. తొలుత నాయకులంతా కలిసి కూర్చున్నా.. తర్వాత ముద్రగడ, ఆయన కుమారులతో మిథున్‌రెడ్డి ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
