ఢిల్లీ : 5 మార్చ్ మరోసారి బీజేపీ టికెట్ దక్కిందన్న సంతోషంలో ఉన్న ఉత్తర్‌ప్రదేశ్‌లోని బారాబంకీ ఎంపీ ఉపేంద్ర సింగ్ రావత్‌కు ఊహించని పరిస్థితి ఎదురైంది.
టికెట్ ప్రకటించిన కొద్దిగంటలకే ఆయనకు చెందినదిగా భావిస్తున్న ఓ అభ్యంతరకర వీడియో ఆన్‌లైన్లో ప్రత్యక్షమైంది. ఓ మహిళతో సన్నిహితంగా ఉన్నట్లు ఆ దృశ్యాల్లో కనిపిస్తోంది. దీనిపై రావత్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అది డీప్ ఫేక్ సాంకేతికతతో రూపొందించిన నకిలీ వీడియో అని పేర్కొన్నారు.
తన ప్రతిష్ఠకు భంగం కలిగించే ఉద్దేశంతో ప్రత్యర్థులు ఈ చర్యకు ఒడిగట్టినట్లు ఆరోపించారు. బాధ్యులను వెంటనే గుర్తించి, అరెస్టు చేయాలని పోలీసులను కోరారు. అది నకిలీదని తేలేవరకూ తాను ఇకపై ఏ ఎన్నికలోనూ పోటీ చేయబోనని సోమవారం ప్రకటించారు.
