పంజాబ్ ఖరౌరీ సరిహద్దులో కాల్పుల్లో రైతు శుభకరణ్‌సింగ్ మృతికి సంబంధించిన ఘటనపై హైకోర్టు రిటైర్డ్ జడ్జి ఆధ్వర్యంలో న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. పిటిషన్‌ను తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం విచారణ జరిపించాలని కోరారు. రైతుల ఉద్యమానికి సంబంధించి ఇప్పటికే హైకోర్టులో రెండు పిటిషన్లు విచారణలో ఉన్నాయి. తాజాగా రైతు మృతిపై కేసు నమోదైంది. ఈ నెల 29న పిటిషన్‌ను విచారణకు రానున్నది. న్యాయవాది హరీందర్ సింగ్ ఇషార్ కోర్టులో పిటిషన్ వేశారు. ఖనౌరీ సరిహద్దుల్లో బుల్లెట్ గాయంతో రైతు మృతి చెందాడని ఆయన ఆరోపించారు.
