అమరావతి: 22 ఫిబ్రవరి రాష్ట్ర ప్రభుత్వం వ్యవహారశైలి కారణంగా ఉద్యోగులు రోడ్లపైకి వచ్చి, నిరసన కార్యక్రమాలు చేయాల్సి వస్తోందని ఏపీ ఐకాస ఛైర్మన్ బండి శ్రీనివాసరావు వెల్లడించారు.
ఎన్ని ఆటంకాలు సృష్టించినా.. పోలీసులు ఎన్ని నోటీసులు ఇచ్చినా తమ లక్ష్యం నెరవేరేవరకు ఉద్యమం కొనసాగుతుందని హెచ్చరించారు. ఏపీ ఐకాస ఈనెల 27 నిర్వహించనున్న ‘చలో విజయవాడ’ పోస్టర్‌ను బుధవారం విజయవాడలోని ఎన్జీఓ కార్యాలయంలో ఆవిష్కరించారు.
