విశాఖపట్నం(ఆంధ్రప్రదేశ్), ఫిబ్రవరి 17 : జిల్లాలో త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లు దాదాపు పూర్తయినట్లు జిల్లా కలెక్టర్ డా. ఎ.మల్లిఖార్జున, పోలీస్ కమిషనర్ డా. ఎ.రవిశంకర్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి వివరించారు.
ఎన్నికలకు సంబంధించి జిల్లాల్లో చేపట్టిన చర్యలపై జిల్లా కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఎస్.పిలతో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనా విజయవాడ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శుక్రవారం సాయంత్రం సమీక్షించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయ వీడియో సమావేశ మందిరం నుండి జిల్లా కలెక్టర్ డా. ఎ.మల్లిఖార్జున, పోలీస్ కమిషనర్ డా. ఎ.రవిశంకర్, జాయింట్ కలెక్టర్ కె. మయూర్ అశోక్, జాయింట్ పోలీస్ కమిషనర్ డా.ఫక్కీరప్ప కగినేల్లి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.
ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని 1941 కేంద్రాల్లో ఫర్నిచర్, లైటింగ్, ర్యాంపులు, టాయిలెట్స్, తాగునీరు వంటి సదుపాయాలను సిద్ధం చేయడం జరిగిందన్నారు. ఇప్పటివరకు 6,7,8
ఫారాలు 51,982 రాగా వాటిలో కొన్ని పరిశీలించి ఆమోదించిన పిదప 38,295 ఫారాలు పెండింగ్ ఉన్నాయన్నారు. వీటిని వారంలోగా పరిష్కరిస్తామని తెలిపారు.
