ఢిల్లీ : 7ఫిబ్రవరి ( హింస) దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి అదుపులోనే ఉంది. తాజాగా గత 24 గంటల వ్యవధిలో 157 కొత్త కేసులు వెలుగు చూసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. తాజా కేసులతో కలిపి దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 1,496కి చేరినట్లు తెలిపింది. ఇక గత 24 గంటల వ్యవధిలో రెండు మరణాలు నమోదైనట్లు పేర్కొంది. ఛత్తీస్‌గఢ్‌లో ఒకరు, ఉత్తరప్రదేశ్‌లో ఒకరు మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించింది.
