అనకాపల్లి(ఆంధ్రప్రదేశ్), ఫిబ్రవరి 5(హిం.స): అనకాపల్లి జిల్లా, నర్సీపట్నంలో విష ప్రయోగానికి గురై సాఫ్ట్వేర్ ఉద్యోగిని మృతి చెందింది. రత్న మాధురి అనే బాధిత యువతిపై శేఖర్ అనే సహ ఉద్యోగి ఈ చర్యకు పాల్పడినట్టు బాధితురాలి తల్లి ఆరోపిస్తున్నారు. మాధురి ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మృతి చెందింది. ఈ మేరకు మృతురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
