గుజరాత్:29 జనవరి (హిం.స)బాలీవుడ్ ప్రతిష్ఠాత్మకంగా భావించే 69వ ‘ఫిల్మ్‌ఫేర్’ అవార్డుల జాబితా వచ్చేసింది. గుజరాత్‌లోని గాంధీనగర్ వేదికగా అట్టహసంగా సాగిన ఈ వేడుకలో విజేతలను ప్రకటించారు. 2023లో విడుదలైన చిత్రాలకు సంబంధించి ఈ అవార్డులు ప్రకటించారు. రణ్‌బీర్‌కపూర్, అలియాభట్ జంట ఉత్తమ నటుడు, ఉత్తమ నటి అవార్డులు గెలుచుకున్నారు.
ఇటీవల విడుదలై ఘన విజయం సాధించిన 12th ఫెయిల్ (12th Fail) ఉత్తమ చిత్రంగా నిలవగా, ఈ చిత్ర దర్శకుడు బెస్ట్ డైరెక్టర్ అవార్డును సొంతం చేసుకున్నాడు. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన యానిమల్ చిత్రానికి అవార్డుల పంట పండింది.
