దిల్లీ,21,జనవరి (హిం.స) ప్రధాని మోడీ సోమవారం ఉదయం 10.25 గంటలకు అయోధ్యలోని కొత్త మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి హెలిప్యాడ్ ద్వారా ఉదయం 10.55 గంటలకు రామయ్య ఆలయానికి చేరుకుంటారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఆలయాన్ని సందర్శిస్తారు. ఇక మధ్యాహ్నం 12.05 గంటలకు ప్రాణప్రతిష్ఠ పూజ కార్యక్రమంలో ప్రధాని పాల్గొంటారు. ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం మధ్యాహ్నం 12.55 గంటల వరకు కొనసాగనుంది.
రామ మందిర ప్రతిష్ఠాపన పూజా కార్యక్రమాల అనంతరం మధ్యాహ్నం 1.00 గంటలకు ప్రధాని మోడీ బహిరంగ కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 2 గంటల వరకు భక్తులతో మమేకమయ్యే బహిరంగ కార్యక్రమంలోనే ఉంటారు. ఇక మధ్యాహ్నం 2.10 గంటలకు కుబేర్ తిలా ఆలయంలో ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. దాంతో ప్రధాని షెడ్యూల్ పూర్తవుతుంది
హిందూస్తాన్ సమాచార్ /నాగరాజ్
