దిల్లీ,21,జనవరి (హిం.స) జమిలి ఎన్నికలు నిర్వహిస్తే ఈవీఎంల కొనుగోలు కోసం ప్రతి 15 ఏళ్లకు రూ.10 వేల కోట్లను ఖర్చు చేయాల్సి వస్తుందని కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) అభిప్రాయపడింది. ఈవీఎంల కాలపరిమితి 15 ఏళ్లని, వీటి ద్వారా మూడు సార్వత్రిక ఎన్నికల నిర్వహణ మాత్రమే సాధ్యమవుతుందని పేర్కొంది. ఈ ఏడాది నిర్వహించనున్న లోక్సభ ఎన్నికల కోసం 11.80 లక్షల పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాల్సిన అవసరముందని, జమిలి ఎన్నికల నిర్వహణకు ప్రతి పోలింగ్ కేంద్రంలో లోక్సభకు, అసెంబ్లీకి విడివిడిగా ఈవీఎంలు కావాలని కేంద్రానికి తెలిపింది. వీటికి తోడు పోలింగ్ రోజున నిర్దిష్ట సంఖ్యలో కంట్రోల్ యూనిట్(సీయూ), బ్యాలెట్ యూనిట్లు(బీయూ), వీవీప్యాట్ యంత్రాలను రిజర్వ్లో ఉంచాలని సూచించింది. జమిలి ఎన్నికల నిర్వహణ సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు కేంద్ర న్యాయశాఖ.. ఎన్నికల సంఘానికి ప్రశ్నావళిని పంపింది. దానికి ఈసీ ఇటీవల సమాధానం తెలియజేసింది.
హిందూస్తాన్ సమాచార్ /నాగరాజ్
