



అయోధ్య, లఖ్‌నవూ17 జనవరి (హిం.స) అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ఠాపన క్రతువులు మంగళవారం నుంచే మొదలయ్యాయి. జనవరి 21, 22 తేదీల్లో అయోధ్య ఆలయానికి సామాన్య భక్తులకు అనుమతి లేదని, 23 నుంచి భక్తులకు రామ్‌లల్లా దర్శన భాగ్యం కల్పిస్తామని ట్రస్టు ప్రకటించింది.
బుధవారం రామ్‌లల్లా విగ్రహం ఊరేగింపుగా అయోధ్యకు చేరుకొంటుంది. అయోధ్యకు వచ్చే భక్తులు రామమందిరంతోపాటు ఇతర ఆధ్యాత్మిక ప్రదేశాలు, వసతి సమాచారాన్ని ‘దివ్య్ అయోధ్య’ యాప్ ద్వారా తెలుసుకోవచ్చని ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది. ఈ యాప్‌ను సీఎం యోగి ఆదిత్యనాథ్ విడుదల చేశారు. జనవరి 19 నుంచి లఖ్‌నవూ, అయోధ్య మధ్య హెలికాప్టర్ సర్వీసును ప్రారంభించనున్నారు.
హిందూస్తాన్ సమాచార, రాజీవ్
