



విశాఖపట్నం:14 జనవరి (హిం.స) విశాఖ ఆంధ్ర యూనివర్సిటీ మైదానంలో సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించారు. భోగి సందర్భంగా యూనివర్సిటీలో మంటలు వేశారు.
ఈ కార్యక్రమంలో సినీ నటుడు సాయికుమార్, బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు, ఇతర బీజేపీ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజ్యసభ ఎంపీ జీవీఎల్ మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాల ప్రజలకు సంక్రాతి శుభాకాంక్షలు తెలిపారు.
విశాఖపట్నంలో నాలుగు రోజులపాటు సంక్రాతి సంబరాలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. తన ఆహ్వానాన్ని మన్నించి భోగి వేడుకలకు హాజరైన నటుడు సాయికుమార్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఉత్తరాంద్ర కలలు, సంస్కృతి ఉట్టిపడేలా భోగి వేడుకలను నిర్వహించామని చెప్పారు.
హిందూస్తాన్ సమాచార, రాజీవ్
