దిల్లీ,11,,జనవరి (హిం.స) ‘ఒకే దేశం – ఒకే ఎన్నిక’పై అధ్యయనానికి మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో కేంద్రం ఏర్పాటు చేసిన కమిటీకి ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన వస్తున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. జమిలి ఎన్నికల నిర్వహణ సాధ్యాసాధ్యాలను పరిశీలించడంలో భాగంగా ఈ కమిటీ ప్రజల నుంచి సలహాలు, సూచనలను ఆహ్వానించింది. ప్రస్తుతం ఉన్న చట్టపరమైన వ్యవస్థలో తగిన మార్పులను సూచించాలని కమిటీ ఇటీవల ఓ ప్రకటనలో కోరింది. ఈ నెల 15లోగా ప్రజలు తమ సూచనలను కమిటీ వెబ్సైట్ https://onoe.gov.in లో పోస్ట్ చేయాలని లేదంటే [email protected] ఐడీకి ఈ-మెయిల్ చేయాలని తెలిపింది.
హిందూస్తాన్ సమాచార్ /నాగరాజ్
