






ఆంధ్రప్రదేశ్ 07 జనవరి (హిం.స)అంగన్‌వాడీలపై ఎస్మా ప్రయోగించడం పట్ల ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం వ్యక్తంచేశాయి. సమస్యల పరిష్కారానికి నిర్బంధ చట్టాలు అమలుచేయడం పరిష్కారం కాదని ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య(ఫ్యాప్టో) చైర్మన్ ఎన్.వెంకటేశ్వర్లు, సెక్రటరీ జనరల్ సీహెచ్ మంజుల పేర్కొన్నారు.
వెంటనే అంగన్వాడీలను చర్చలకు పిలిచి సమస్యలను పరిష్కరించాలన్నారు. ఎస్మా ప్రయోగించడం ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిదర్శనమని ఏపీటీఎఫ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి.హృదయరాజు, ఎస్.చిరంజీవి అన్నారు. ప్రభుత్వం ఎస్మా చట్టాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మన్నం శ్రీనివాస్, శ్రీరామశెట్టి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు.
హిందూస్తాన్ సమాచార, రాజీవ్
