కమలాపురం, 31 డిసెంబర్ (హిం.స)
గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో సీఎం జగన్ 85 శాతం కూడా అమలు చేయలేకపోయారని టీడీపీ జిల్లా ముస్లిం మైనార్టీ అధ్యక్షుడు ఖాదర్ బాషా, నియోజకవర్గ రైతు సంఘం అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు.
ఈ రోజు కమలాపురం పార్టీ కార్యాలయంలో వారు విలేకర్లతో మాట్లాడారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకొస్తానని, మద్యపాన నిషేధం చేస్తానని హామీలిచ్చి మాటతప్పారని మండిపడ్డారు.
హిందూస్తాన్ సమాచార్,సంధ్యా
