కుప్పం, 27 డిసెంబర్ (హిం.స)
శాంతిపురం మండలంలోని కడపల్లి గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న వ్యక్తిని అరెస్టు చేసినట్లు ఈ రోజు బుధవారం కుప్పం ఎస్ ఈ బి ఇంచార్జీ సీఐ మాధవస్వామి తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. మురుగేష్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకొని కర్ణాటక మద్యం ప్యాకెట్లను స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. ఎవరైనా కర్నాటక మద్యం విక్రయిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఎస్ఐ రామ్ మూర్తి మరియు సిబ్బంది పాల్గొన్నారు.
హిందూస్తాన్ సమాచార్,సంధ్యా
