ఢీల్లీ, 27 డిసెంబర్ (హిం.స)
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది కల తీరే సమయం ఆసన్నవుతోంది. అయోధ్యలో రామయ్య కొలువు దీరే ముహర్తం సమీపిస్తున్నందున ఏర్పాట్లు భారీగా చేస్తున్నారు.
మరోవైపు రామాలయ ప్రతిష్టాపనకు రాజకీయ నేతలకు, ప్రముఖులకు, స్వాములకు ఆహ్వానాలను రామ ట్రస్ట్ బోర్డు పంపిస్తోంది. రామ్ లల్లా ఆలయ ప్రతిష్టాపనకు హాజరుకావడంపై వామపక్ష పార్టీల నేతలను ప్రశ్నించగా.. ప్రధాని మోడీ హాజరు కానున్నందున తాము ప్రారంభోత్సవానికి హాజరు కాబోమని చెప్పారు. ఆహ్వానం విషయంపై సీపీఐ-ఎం నేత సీతారాం ఏచూరి మాట్లాడుతూ నృపేంద్ర మిశ్రాజీ మమ్మల్ని ఆహ్వానించారని చెప్పారు. అయితే రామాలయం ప్రారంభోత్సవానికి వస్తావా రావా అని అడగలేదు.. అయితే తాము ఈ ఉత్సవానికి వెళ్లమని చెప్పారు.
ఆహ్వానం అందిన వారు వెళ్లాలా వద్దా అనేది వారి ఇష్టం అని ఏచూరి అన్నారు. ఆత్మకు, భగవంతుడికి మధ్య ఉండే పవిత్ర సంబంధమే మతమని అన్నారు. అయితే తాము నృపేంద్ర మిశ్రాజీని చాలా గౌరవిస్తాము. వారు నిర్వహిస్తున్న ఫంక్షన్ రాష్ట్ర ప్రాయోజితమైనది. ప్రధాని మోడీ అక్కడే ఉంటారు. దీనిని రాజకీయంగా మలుస్తున్నారు.. కనుక మేము రామాలయ ప్రతిష్ఠాపనోత్సవాలకు వెళ్ళమని స్పష్టం చేశారు. అయితే ఆహ్వానాలు అందుకున్నవారు నచ్చితే వెళ్ళవచ్చు అని చెప్పారు ఏచూరి.
హిందూస్తాన్ సమాచార్,సంధ్యా
