పణజీ 25,డిసెంబర్ (హిం.స) కరోనా మహమ్మారిపై దేశం గతంలోనే పోరాడిందని.. కొత్త వేరియంట్పై ప్రజలు, పర్యాటక పరిశ్రమకు ఆందోళన అవసరంలేదన్నారు. లాక్డౌన్ విధించే అవకాశం ఉంటుందా? అని విలేకర్లు అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రిశ్రీపాద్ నాయక్ స్పందిస్తూ.. ‘‘భయపడాల్సిన అవసరం లేదు. అది మళ్లీ వచ్చినా మనం పోరాడగలం. గతంలోనూ మనం ఈ మహమ్మారిపై పోరాడాం’’ అని సమాధానం ఇచ్చారు.
కరోనా కొత్త వేరియంట్ జేఎన్.1 వ్యాప్తిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర పర్యాటకశాఖ సహాయ మంత్రి శ్రీపాద్ నాయక్ అన్నారు. ఆదివారం ఆయన దక్షిణ గోవాలో పాంచజన్య వార పత్రిక నిర్వహించిన ‘సాగర్ మంథన్ 2.0 ’ కార్యక్రమంలో పాల్గొన్నారు
హిందుస్థాన్ సమాచార,నాగరాజ్
