

అమరావతి, డిసెంబరు 24 (హిం.స)): ఓటర్ల జాబితాలో ఒక్క మృతుడు కానీ, డబుల్ ఎంట్రీ కానీ లేకుండా ప్రక్షాళన జరగాలని కేంద్ర ఎన్నికల సంఘం సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్లు ధర్మేంద్ర శర్మ, నితీష్ కుమార్ వ్యాస్ నేతృత్వంలోని బృందం స్పష్టం చేసింది.
ఎన్నికల నిర్వహణలో దోషరహిత ఓటర్ల జాబితా కీలకమని…అలాంటి జాబితాతో ఎన్నికలకు వెళ్లడం వల్ల వివాదరహితంగా, ప్రశాంత వాతావరణంలో ఎన్నికల ప్రక్రియను విజయవంతం చేయవచ్చని పేర్కొంది. ఎన్నికల నిర్వహణలో పారదర్శకత, జవాబుదారీతనం, నిష్పక్షపాతమే కీలకమని తేల్చిచెప్పింది. ఈ బృందం ఎస్‌ఎ్‌సఎర్-2024, ఎన్నికల సన్నద్ధతపె విజయవాడలో సీఈవో ముఖే్‌షకుమార్ మీనా, కలెక్టర్లు, ఎస్పీలు, ప్రభుత్వ అధికారులతో చేపట్టిన సమీక్షా సమావేశాలు శనివారం ముగిశాయి.
శుక్రవారం 18 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సమీక్ష నిర్వహించగా, శనివారం మిగిలిన 8 జిల్లాల అధికారులతో సమీక్ష జరిపారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి, డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డిలతోనూ ఈసీఐ బృందం సమావేశమైంది. రాష్ట్రవ్యాప్తంగా శాంతిభద్రతలు, ఎన్నికల నిర్వహణకు అందుబాటులో ఉన్న సిబ్బంది, మౌలిక సదుపాయాలు తదితర వివరాలపై ఆరా తీసింది.
హిందూస్తాన్ సమాచార, రాజీవ్
